ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 23 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని మొదేలలో ఒక చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారనే సమాచారంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు ఫిర్యాదు చేయగా,దాని ఆధారంగా Cr.No. 317/2025, సెక్షన్ 80–జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసు నమోదు చేసి, మొదేల్ గ్రామానికి చెందిన దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎలుగటి తిరుపతి మరియు ఎలుగటి కళావతిలపై విచారణ ప్రారంభించడమైంది.
విచారణలో భాగంగా అక్రమంగా దత్తత తీసుకున్న మూడేళ్ల బాలికను చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఆదిలాబాద్ ఎదుట హాజరుపరచడం జరిగింది.
తదుపరి విచారణలో, A1–పరిగిపండ్ల విజయలక్ష్మి,భర్త: వెంకటేశ్వర్లు,వయస్సు: 47 సంవత్సరాలు,కులం:పద్మశాలి, వృత్తి: టైలరింగ్, నివాసం:ఇంటి నెం.7-313,తీగల్ పహాడ్,
అల్లూరి సీతారామరాజు కాలనీ, మంచిర్యాల, మరియుA2–బొజ్జ స్వరూప,భర్త: శ్రీనివాస్, వయస్సు: 41 సంవత్సరాలు, కులం: పద్మశాలి,వృత్తి: లక్ష్మి నారాయణ ఆస్పత్రి వర్కర్, నివాసం: ఇంటి నెం. 2-04, మహాలక్ష్మివాడ,లక్షెట్టిపేట, ప్రస్తుతం నివాసం: సూరారం గ్రామం,లక్షెట్టిపేట మండలం
అనే వారు పిల్లలు లేని దంపతులను ఆసరాగా తీసుకొని, వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, ఎలాంటి చట్టబద్ధమైన దత్తత నిబంధనలు పాటించకుండా పిల్లలను అక్రమంగా దత్తతకు ఇచ్చినట్లు గుర్తించడం జరిగింది.
పైన పేర్కొన్న నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తదుపరి విచారణ కొనసాగుతుంది.ఇట్టి కేసులో నిందితులను పట్టుకోవడంలో చాక చక్యంగా వ్యవహరించిన సిబ్బంది శ్రీకాంత్, మల్లేష్,బగ్గని సత్యనారాయణ,ఎంబడి సత్యనారాయణ,మురళి,ప్రవళిక లను అబినందించడం జరిగింది.

హెచ్చరిక
అక్రమంగా పిల్లలను దత్తత తీసుకున్నా,ఇచ్చినా, రవాణా చేసినా లేదా తరలించినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి రమణ ముర్తి,లక్షెట్టిపెట సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గొపతి సురేష్ తెలిపారు.