ఖానాపూర్ లోని బాపిస్ట్ చర్చిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.మహిళలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలంతా కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం బాపిస్టు చర్చిలో మహిళలు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.