Thursday, July 9, 2026
ads
Homeతెలంగాణప్రారంభమైన బుద్వేల్ రోడ్డు పనులు.

ప్రారంభమైన బుద్వేల్ రోడ్డు పనులు.

📰 Generate e-Paper Clip

రోడ్డు పనులను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.

రాజేంద్రనగర్: ఎట్టకేలకు బుద్వేల్ కిష్టమ్మ గుట్ట నుండి బుద్వేల్ పెట్రోల్ పంపు వరకు సిసి రోడ్ పనులు ప్రారంభమయ్యాయి. గత ఫిబ్రవరి 13వ తేదీన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ప్రారంభం కాలేదు.దీంతో సాక్షి రాజేంద్రనగర్ జోన్ లో ప్రారంభం కానీ బుద్వేల్ ప్రధాన రోడ్డు పనులు అనే శీర్షికపై కథనం ప్రచురితమైంది.

కాంగ్రెస్ పార్టీ నాయకులు రగడంపల్లి శ్రవణ్ కుమార్, జలమండలి ఉద్యోగ సంఘం నాయకుడు పెండ్యాల సాయి మల్లిక్ లు ఎమ్మెల్యేను కలిసి మరోసారి సమస్యను వివరించారు. దీంతో ఆయన సంబంధిత అధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి పనులను వెంటనే ప్రారంభించాలని మందలించాడు. ఎట్టకేలకు కాంట్రాక్టర్ ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular